కామారెడ్డి జిల్లా జుక్కల్ సర్పంచ్ బొంపల్లి రాములుపై.... పెద్దఎడిగి సర్పంచ్, తన కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి దాడి చేశారు. రాత్రి వేళ జుక్కల్‌లోని సర్పంచ్ ఇంటికి వెళ్లి, ఆయన భార్య ముందే... ఇష్టారీతిన కొట్టారు. చెప్పులు, కర్రలతో దాడి చేశారు.
చెప్పులు, కర్రలతో జుక్కల్ సర్పంచ్‌పై దాడి.. - తెలంగాణ తాజా వార్తలు
కామారెడ్డి జిల్లా జుక్కల్ సర్పంచ్‌పై.. చెప్పులు, కర్రలతో పెద్దఎడిగి సర్పంచ్, అతని కుటుంబ సభ్యులు దాడిచేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెద్దఎడిగి సర్పంచ్, ఆయన తమ్ముళ్లకు జుక్కల్ శివారులోని భూమి ఉంది. దానిపై కొంతకాలంగా వివాదం సాగుతోంది. దీనిపై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. వివాదంలో ఉన్న ఆ భూమిని ఎవరూ కొనొద్దని... కౌలు చేయొద్దని... జుక్కల్ సర్పంచ్ రాములు ఊర్లో దండోరా వేయించారు. దీనిపై ఆగ్రహించిన పెద్దఎడిగి సర్పంచ్... తన కుటుంబసభ్యులు, స్నేహితులు, అనుచరులతో వచ్చి... జుక్కల్ సర్పంచ్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి:ఓ వృద్ధురాలి వేదన... సాయం కోసం ఎదురుచూపు