Attack on Excise SI: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పురాణీపేట్ శివారులో ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్లిన వారిపై ఈ దాడి జరిగింది. గుడుంబా కాస్తున్నారనే సమాచారం మేరకు భీంగల్ ఆబ్కారీశాఖ ఎస్ఐ నర్సింహులు, కానిస్టేబుల్ వాహనంలో తనిఖీకి వెళ్లారు. సమీపంలో మద్యం సేవిస్తున్న నలుగురు... వారిని చూసి పారిపోవడానికి యత్నించారు. అందులో ఒకరు పోలీసులకు దొరికారు. అతడిని విచారించి వెళ్తుండగా ముగ్గురు మందుబాబులు వచ్చి ఎస్సై, కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డారు.
Attack on Excise SI: ఎస్సై చేతిలో లాఠీ లాక్కొని ఆయన్నే కొట్టారు.. - Nizamabad News
Attack on Excise SI: ఆబ్కారీ ఎస్సై, కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పురాణీపేట్ శివారులో చోటుచేసుకుంది. నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడి చేయడానికి వెళ్లిన వారిపై ఈ దాడి జరిగింది.
Attack
ఎస్సై చేతిలో ఉన్న లాఠీని లాక్కుని తీవ్రంగా కొట్టారు. ఆబ్కారీ ఎస్సై నర్సింహులు ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు భీమ్‌గల్ ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. కేసు నమోదైనా వారిని రిమాండ్‌కు తరలించలేదు. రాజకీయ ఒత్తిడి కారణంగానే రిమాండ్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:
Last Updated : Mar 18, 2022, 8:42 AM IST