MURDER ATTEMPT ON LECTURER : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సుమంగళి అనే లెక్చరర్‌పై ఆమె భర్తే హత్యాయత్నం చేశాడు. కళాశాల మైదానంలో కత్తితో గొంతు కోశాడు. లెక్చరర్ కేకలు విన్న తోటి సిబ్బంది, విద్యార్థులు రక్తపుమడుగులో ఉన్న ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. భార్య గొంతు కోసి పరారవుతున్న భర్తను తోటి లెక్చరర్లు పట్టుకుని.. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
కోర్టులో ఆ కేసు ఉండగానే.. మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త - husband attack on wife
MURDER ATTEMPT ON LECTURER : కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త.. తన భార్యపై దాడి చేసిన ఘటన ఏపీలోని అనంతపురంలో కలకలం రేపింది. ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సుమంగళి అనే మహిళపై ఆమె భర్త కత్తితో దాడిచేశాడు.
MURDER ATTEMPT ON LECTURER
భర్తతో విభేదాల కారణంగా కోర్టులో విడాకుల కోసం కేసు వేశారు. కోర్టులో కేసు ఉండగానే సుమంగళిపై భర్త పరేశ్ హత్యాయత్నం చేశాడు. రాయదుర్గానికి చెందిన సుమంగళి.. కామర్స్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. సుమంగళి ఇటీవలే గుంటూరు ఎయిడెడ్ కళాశాల నుంచి అనంతపురానికి బదిలీ అయ్యారు.
ఇవీ చదవండి: