ప్రేమ పెళ్లి చేసుకోవడమే ఆ యువకుడి పాలిట శాపమైంది. అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామంలో చోటుచేసుకుంది.
యువకుడిపై అమ్మాయి బంధువుల దాడి.. ప్రేమ వివాహమే కారణం - ప్రేమజంటపై అమ్మాయి బంధువుల దాడి
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామంలో జరిగింది. తీవ్ర రక్తస్రావమైన యువకుడిని కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
![యువకుడిపై అమ్మాయి బంధువుల దాడి.. ప్రేమ వివాహమే కారణం Attack of the girl's relatives on the young man because of love marriage in marrikunta village garidepally mandal suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10500898-967-10500898-1612447744173.jpg)
యువకుడిపై అమ్మాయి బంధువుల దాడి.. ప్రేమ వివాహమే కారణం
మర్రికుంట గ్రామానికి చెందిన వినయ్, పెన్ పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన రుచిత బుధవారం హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మర్రికుంటలోని వినయ్ ఇంటికి వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అమ్మాయిని కొడుతూ బలవంతంగా ఇంటికి లాక్కెళ్లారు. తీవ్ర రక్తస్రావమైన యువకుడిని కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.