తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold seized in shamshabad: బురఖాకు పూసలను డిజైన్ రూపంలో అంటించి... ఆపై స్మగ్లింగ్ - బంగారం పట్టివేత తాజా వార్తలు

Gold seized in shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిత్యం కట్టుదిట్టంగా తనిఖీలు చేపడుతున్నా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి విదేశాల నుంచి పూసల మాటున తరలిస్తున్న రూ.18.18 లక్షల విలువైన అక్రమ బంగారాన్ని ఆదివారం భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Gold seized in shamshabad
బురఖాలో బంగారం

By

Published : Feb 28, 2022, 11:58 AM IST

Gold seized in shamshabad: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి విదేశాల నుంచి పూసల మాటున తరలిస్తున్న అక్రమ బంగారాన్ని ఆదివారం భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బురఖాకు పూసల డిజైన్ రూపంలో...

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు దుబాయ్‌ నుంచి ఫ్లయ్‌ దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి బయలుదేరాడు. 350 గ్రాముల బంగారాన్ని పూసలుగా మార్చి వాటికి తెలుపు రంగు వేసి సామగ్రిలో తీసుకొచ్చాడు. ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని సామగ్రిని తనిఖీ చేయగా బంగారం తరలింపు గుట్టు రట్టయింది. రూ.18.18 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారపు పూసలను బురఖాకు డిజైన్‌గా అంటించి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

పూసల రూపంలో బంగారం

ఇదీ చదవండి:మేవాత్​ ముఠాల క్రైం కహానీ.. చోరీలకు అడ్డొస్తే దారుణంగా ఖూనీ..

ABOUT THE AUTHOR

...view details