తెలంగాణ

telangana

ETV Bharat / crime

కలిసి తాగారు.. తర్వాత కొట్టుకున్నారు.. కత్తితో దాడి చేయడంతో..! - Khammam crime news

వారిరువురూ బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకొని రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి వచ్చారు. స్నేహితులైన వాళ్లు సరదాగా మందు తాగేందుకు వెళ్లారు. తాగిన మైకంలో వారిలో వారు ఘర్షణ పడ్డారు. నియంత్రణ కోల్పోయిన స్నేహితుడు మరో స్నేహితుడిని కత్తెరతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Khammam
Khammam

By

Published : Sep 25, 2022, 11:27 AM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చ్​ కాంపౌండ్​ ప్రాంతంలో మగ్గం వర్క్ చేసేందుకు కోల్​కతా నుంచి వచ్చిన కార్మికులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి రాకేశ్​, పర్వేజ్​తో పాటు మరో స్నేహితుడు మద్యం తాగేందుకు వెళ్లారు. తాగిన తర్వాత ఆ యువకులు వారిలో వారు గొడవపడ్డారు. దీంతో రాకేశ్​ అనే యువకుడు తన వద్ద ఉన్న కత్తెరతో పర్వేజ్​పై దాడి చేయగా.. పర్వేజ్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో అడ్డుగా వెళ్లిన మరో యువకుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details