తెలంగాణ

telangana

ETV Bharat / crime

ATM Robbery in Kadapa: సీసీ కెమెరాలకు రంగుపూసి ఏటీఎం కొట్టేశారు.. పోలీసులు ఊరుకుంటారా?

ATM Robbery in Kadapa : సీసీకెమెరాలకు రంగుపూసి ఏటీఎం కొల్లగొట్టిన ఇద్దరు నిందితులను కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి వారు దోచేసిన 41 లక్షల నుంచి 9.5 లక్షలు, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ATM Robbery in Kadapa
కెమెరాలకు రంగుపూసి ఏటీఎం కొట్టేశారు

By

Published : Dec 13, 2021, 12:16 PM IST

ATM Robbery in Kadapa : కడప నగరంలో రెండు ఏటీఎంలను పగులగొట్టి 41 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన హరియాణా ముఠాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 7న దొంగలు కడప శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, రామాంజనేయపురం వద్ద ఉన్న రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు. తెల్లవారుజామున గ్యాస్ కట్టర్లతో తొలగించి.. కేవలం నిమిషాల్లోనే రూ.41 లక్షలు కాజేశారు.

రంగంలోకి 4 బృందాలు..

Kadapa ATM Robbery : కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం 4 బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు.. హరియాణా, రాజస్థాన్, దిల్లీకి వెళ్లినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. హరియాణాకు చెందిన ప్రధాన నిందితులు ఇద్దరిని పట్టుకున్నామని వెల్లడించారు.

9.5 లక్షల రికవరీ..

ATM Robbery News : నిందితుల నుంచి రూ.9.5 లక్షల నగదు, 2 నాటు తుపాకులు, 20 కిలోల గంజాయి, 40 మద్యం బాటిళ్లు, గ్యాస్ కట్టర్, రెండు నిచ్చెనలు, అత్యాధునికమైన పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

పరారీలో మరో ముగ్గురు ..

ATM Chori in Kadapa : చోరీకి కారులో వచ్చిన దొంగలు.. చోరీ అనంతరం కారును కంటైనర్​లో తీసుకుని హైదరాబాద్​ వెళ్లారని, అక్కడి నుంచి హరియాణా వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, 30 మంది సభ్యుల పోలీసు బృందాలు హరియాణా వెళ్లి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

సీసీకెమెరాలకు రంగుపూసి..

ఈ చోరీ నిందితులపై రాజస్థాన్​లోనూ పది కేసులు ఉన్నాయన్న ఎస్పీ.. ఇటీవల తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఏటీఎం దొంగతనాలు జరిగాయని వెల్లడించారు. ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలకు రంగు పూసి చోరీ చేస్తుంటారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి :Ganja Smuggling through RTC bus: ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details