Atm vehicle driver arrest: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని సాయిబాబానగర్‌లో గల ఏటీఎంలో రైటర్స్ సంస్థ సిబ్బంది ఈ నెల 19న నగదు నింపుతుండగా... డ్రైవర్ సాగర్ ఏటీఎం వాహనంలో ఉన్న రూ.36 లక్షలతో పరారయ్యాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అతను చోరీ చేసిన వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి... నగదుతో వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకొన్నాడు. చోరీ చేసిన నగదులో కొంత డబ్బు పెట్టి ఖరీదైన చరవాణి కొన్నాడు. ఆదివారం తిరిగి హైదరాబాద్ చేరుకొని ఓ కారును రూ.8.6 లక్షలకు కొనుగోలు చేశాడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టిన దుండిగల్ పోలీసులు నిందితుడు కర్నూలులో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం దుండిగల్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.