తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏటీఎంల దగ్గర సాయం చేస్తున్నట్టు నటించి.. కార్డులు, డబ్బులతో ఉడాయిస్తారు..

ATM Cards Robbery Gang Arrest: ఏటీఎం కేంద్రాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు, కార్డులు దొంగిలించే ముఠాను ఏపీలోని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 125 ఏటీఎం కార్డులు, కారు, 28వేల రూపాయలను, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

atm-cards-robbery-gang-arrest-in-visakha
atm-cards-robbery-gang-arrest-in-visakha

By

Published : Jun 8, 2022, 5:38 PM IST

ATM Cards Robbery Gang Arrest: ఏటీఎం కేంద్రాల్లో సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు, కార్డులు దొంగిలించే ముఠాను ఏపీలోని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 125 ఏటీఎం కార్డులు, కారు, 28వేల రూపాయలను, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంచరపాలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి నాగేంద్ర.. గత నెల 10న నగదు జమ చేయాలని ఎస్​బీఐ ఏటీఎంకు వెళ్లగా.. అక్కడే ఉన్న దుండగుడు నాగేంద్రను బలంగా కొట్టి.. ఏటీఎం కార్డు, 9 వేల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు.

బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా ఏటీఎం కేంద్రాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. రైల్వేస్టేషన్ సమీపంలో నలుగురు యువకులను గుర్తించి ఆరా తీశారు. వారు ఇచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా.. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న హరియాణాకు చెందిన సందీప్‌ను పోలీసులు గుర్తించారు. సందీప్ నేతృత్వంలో నెల్లూరు, హైదరాబాద్, కర్ణాటక, హరియాణాలో.. ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

డబ్బులు, ఏటీఎం కార్డులు దొంగిలించే ముఠా అరెస్ట్..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details