తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకునిపై అన్న దాడి - rangareddy district crime news

11 ఏళ్ల చెల్లికి ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించసాగాడు. దీంతో బాలిక సోదరుడు .. నా చెల్లిని ఎందుకు వేధిస్తున్నావ్​.. అంటూ ఆ యువకుని​పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Assault with a knife on a young man in rangareddy district
చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకునిపై అన్న దాడి

By

Published : Sep 11, 2021, 9:06 AM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో ఓ యువకునిపై మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది...

మొయినాబాద్ గ్రామానికి చెందిన బాలిక ( 11) 7వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు షేక్ హాబీబ్(21).. బాలికను గత 6నెలల నుంచి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు పలుమార్లు తమ పిల్ల జోలికి రావద్దని హెచ్చరించారు. అయినా హాబీబ్ వేధించడం మానలేదు. శుక్రవారం బాలికను చేతి పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పింది.

కుటుంబ సభ్యులు హాబీబ్ ఇంటికి వెళ్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి మధ్య మాటా మాటా పెరిగి... గొడవకు దారి తీసింది. దీంతో 'నా చెల్లిని ఎందుకు వేధిస్తున్నావ్​' అంటూ హాబీబ్​పై బాలిక సోదరుడు కత్తితో దాడి చేశాడు. హాబీబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. వివరాలను సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details