ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో వెలుగుచూసింది. అన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళ(50) ఈ నెల 4న అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఆచూకీ తెలియకపోవడం వల్ల… ఈ నెల 6న పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. సీఐ కిషన్ విచారణ చేపట్టగా.. అదే గ్రామానికి చెందిన కొందరు అనుమానితులను విచారించగా అసలు విషయం బయటపడింది.
హత్యాచారం.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం - అన్నారం షరీఫ్ గ్రామం
ఇద్దరు దుండగులు ఓ మహిళపై కన్నేశారు. అంతే అదును చూసి ఆమెపై హత్యాచారానికి ఓడిగట్టారు. భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు తెలుపగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తీరా ఆమె హత్యాచారానికి గురైందని తెలిసి ఆ కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. ఈ విషాదకర ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.
అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన కృష్ణ ఇంట్లో తనిఖీ చేయగా సెప్టిక్ ట్యాంక్‌లో సదరు మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పంచనామ అనంతరం కేఎంసీ వైద్యాధికారి డాక్టర్ సురేందర్, డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధరించారు. అదే గ్రామానికి చెందిన పి.కృష్ణ, ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన రాజు హత్యాచారం చేసినట్లుగా గుర్తించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా నిందితులను అరెస్టు చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీపీ నరేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:Murder attempt: ప్రముఖ వ్యాపారవేత్త వాసంతి శెట్టిపై హత్యాయత్నం