తెలంగాణ

telangana

ETV Bharat / crime

వరుస చోరీల నిందితుడు అరెస్ట్​... 800 ఏళ్ల పురాతన విగ్రహాలు స్వాధీనం

Thief arrested : గత కొన్ని నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 800 ఏళ్ల క్రితంనాటి పురాతన విగ్రహాలతో పాటు, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఎస్పీ సురేశ్​కుమార్​ వెల్లడించారు.

Chory
Chory

By

Published : Feb 17, 2022, 7:43 PM IST

Thief arrested : కుమురంభీం ఆసిఫాబాద్​ సహా పలు జిల్లాల్లో కొన్ని నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. నిందితుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సురేశ్​కుమార్​ తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసిన పలువురు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని సిర్పూర్​ టీ మండలం వెంకట్రావుపేటలో అరెస్టు చేశారు. కొన్ని నెలల క్రితం కాగజ్​నగర్​, కౌటాలలో పలు చోరీలను ఇతడే చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి 69 గ్రాముల బంగారం, రూ.16 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అపహరించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి.. గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. 2020, 21లో కాగజ్​నగర్​లో, 2021లో కౌటాలలోని శివాలయంలో, కాగజ్​నగర్​లో ఓ బ్యాంకులోను ఇలా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. సీసీటీవీ దృశ్యాలను సోషల్​మీడియాలో వైరల్​ చేయడంతో నిందితుడిని అరెస్టు చేశాం. నిందితుడి నుంచి 800 ఏళ్లనాటి పురాతన విగ్రహాలు, 69గ్రాముల బంగారం, 16వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. - సురేశ్​కుమార్​, ఎస్పీ

వరుస చోరీల నిందితుడు అరెస్ట్​... 800 ఏళ్ల పురాతన విగ్రహాలు స్వాధీనం

ఇదీ చూడండి :Honor Killing in Sangareddy: ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి

ABOUT THE AUTHOR

...view details