తెలంగాణ

telangana

ETV Bharat / crime

jadcherla road accident: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఏఎస్ఐ మృతి - మహబూబ్ నగర్ జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి(ASI died in road accident) చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఏఎస్ఐని గుర్తుతెలియని కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని స్థానిక ఎస్వీఎస్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

jadcherla road accident
jadcherla road accident

By

Published : Nov 27, 2021, 3:27 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(jadcherla road accident) ఏఎస్ఐ మృతి చెందారు. విధులు ముగించుకొని శంకరాయపల్లి గ్రామంలోని తన ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఏఎస్ఐ అనంత రాములు(51)ను గుర్తుతెలియని కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఏఎస్ఐని గుర్తించిన స్థానికులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు(ASI died in jadcherla road accident) నిర్ధారించారు.

శంకరాయపల్లి తండాకు చెందిన అనంత రాములు... గత కొంతకాలం నుంచి నాగర్ కర్నూల్​ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డిపార్ట్‌మెంట్​లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారులో వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:Pargi Baby slips from 2nd floor: ఆడుకుంటూ.. భవనంపై నుంచి పడి చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details