తెలంగాణ

telangana

ETV Bharat / crime

వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ - తెలంగాణ నేర వార్తలు

మంచిర్యాల జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రామకృష్ణాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్దనుంచి 75 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఉదయ్ కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడైన సూరజ్​ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు ఛత్తీస్​గఢ్​లోని జగదల్పూర్​కు చెందిన వారిగా గుర్తించారు.

Arrest of two interstate thieves convicted of a series of thefts in  mancherial district
వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

By

Published : Mar 24, 2021, 12:25 AM IST

మంచిర్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 75 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల్ డీసీపీ ఉదయ్ కుమార్ వెల్లడించారు.

రెండేళ్ల క్రితం మంచిర్యాలకు మకాం మార్చారు...

నిందితులు ఛత్తీస్​గఢ్​లోని జగదల్పూర్​కు చెందిన వారిగా గుర్తించామన్నారు. జగదల్పూర్​కు చెందిన సూరజ్, సత్యవతి దంపతులు ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవారని డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. రెండేళ్ల క్రితం మంచిర్యాలకు వచ్చినట్లు వెల్లడించారు.

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్​:

సూరజ్​ తమ్ముడు రాహుల్ శెట్టి కూడా వీరితో జతకలిసి చోరీలు చేసేవారని పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట, మంచిర్యాలలో 16 చోట్ల దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. వరుస ఘటనలపై అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రాహుల్ శెట్టి, సత్యవతిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన సూరజ్ కోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన రామకృష్ణాపురం ఎస్సై రవి ప్రసాద్, సిబ్బందికి అధికారులు రివార్డులు అందజేశారు.

ఇదీ చూడండి:రెండో అంతస్తు పైనుంచి దూకి ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details