ఏపీ విశాఖ జిల్లా సీలేరు నుంచి ఆటోలో గంజాయి తీసుకొచ్చి జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్లో ఉంచిన ఇద్దరు నిందితులను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 70కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్ నగర్‌కు చెందిన నర్సింగ్ సింగ్, రమేశ్‌లు కలిసి సీలేరు నుంచి ఈనెల 17న ఆటోలో గంజాయి తీసుకొచ్చారు.
Cannabis: మంగళ్‌హాట్ స్పాట్ కానీ రహ్మత్‌నగర్‌లో దొరికిపోయిన గంజాయి ముఠా - Rahmat nagar ganja gang arrest
తెలంగాణలో గంజాయి విక్రయాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ మేరకు అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతరం సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇవాళ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Cannabis
మంగళ్ హాట్లో విక్రయించాల్సి ఉండగా... పోలీసుల నిఘా పెరగడం వల్ల జూబ్లీహిల్స్‌లోని రహ్మత్ నగర్లో ఓ గదిలో ఉంచారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నర్సింగ్, రమేశ్‌లపై గతంలోనూ కేసులున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగరంలో గంజాయి విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:
Drugs in Hyderabad: నగరంలో మరోసారి గుప్పుమన్న డ్రగ్స్.. 10 కోట్ల విలువైన సరకు స్వాధీనం