నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్న ఘరానా మోసగాళ్లను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు.. ప్రభుత్వ ముద్రణతో ఉన్న నకిలీ స్టాంపు పేపర్లను సృష్టించి.. రూ. వందల కోట్ల విలువైన సర్కారు భూమికి ఎసరు పెట్టినట్లు వారు తెలిపారు. ప్రధాన నిందితులు.. తిరుమల రామచందర్ రావు, దర్పల్లి సంపత్లపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో.. విక్రయాలకు పాల్పడుతోన్న కేటుగాళ్ల అరెస్ట్ - ప్రభుత్వ భూమి అక్రమ విక్రయాలు
నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూములను విక్రయిస్తోన్న ఇద్దరు ఘరానా మోసగాళ్లని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
fake documents
'మిహిరా బిల్డ్ కన్స్ట్రక్షన్స్' అనే సంస్థ ఫిర్యాదుతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో.. నకిలీ పత్రాలతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని.. 9 ఎకరాల 17 గుంటల అత్యంత ఖరీదైన భూమిని విక్రయించినట్లు వారు తెలిపారు. ఈ వ్యవహారం నడిపేందుకు సీసీఎల్ఏ, జీహెచ్ఎంసీ అధికారుల ముద్రణలు తయారు చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: మహిళపై దూసుకెళ్లిన లారీ