తెలంగాణ

telangana

ETV Bharat / crime

మైల్వార్‌ అడవిలో వేటగాళ్లు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు - వికారాబాద్​ జిల్లాలో వేటగాళ్ల అరెస్ట్​

నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్న పది మంది వేటగాళ్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు నాటు తుపాకులు, ఐదు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

hunters arrest in vikarabad district
వికారాబాద్​ జిల్లాలో వేటగాళ్ల అరెస్ట్

By

Published : Mar 29, 2021, 10:04 AM IST

వికారాబాద్​ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ అటవీ ప్రాంతంలో జంతువులను నాటు తుపాకులతో వేటాడుతున్న పది మంది వేటగాళ్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు నాటు తుపాకులు, ఐదు ద్విచక్రవాహనాలు, 9 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని బషీరాబాద్‌ ఠాణా పోలీసులకు అప్పగించారు.

కర్ణాటకలోని బొందెంపల్లి తండా, కొడంగల్‌ మండలం బోయపల్లి తండాకు చెందిన కొందరు వ్యక్తులు, నాటు తుపాకులతో నీళ్లపల్లి-మైల్వార్‌ అటవీ ప్రాంతంలో వేటాడుతున్నారని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. వేటగాళ్లను మాటువేసి పట్టుకున్న సిబ్బంది వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాండూరు గ్రామీణ సీఐ జలంధర్ ‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:రాతల తండాలో వ్యక్తి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details