తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్ - black fungus injections

బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న వారిని హైదరాబాద్​లో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Arrest of persons selling black fungus injections illegally in Hyderabad
Arrest of persons selling black fungus injections illegally in Hyderabad

By

Published : Jun 6, 2021, 1:14 PM IST

సికింద్రాబాద్ నల్లబజారులో.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 ‘అంపోట్రేట్ బి’ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన నిఖిల్ రెడ్డి, స్రవంతి, వేణులు ముఠాగా ఏర్పడ్డారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అవసరం ఉన్న వారికి అధిక మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు విద్యార్థి కాగా మరో ఇద్దరు ఫార్మా మార్కెట్ ఏజెంట్లుగా ఉన్నారు. వీరు బోయిన్​పల్లిలో అక్రమంగా అధిక ధరలకు ఇంజక్షన్లు అమ్ముతున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను బోయిన్​పల్లి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: JNTU: జులై 1 నుంచి ఇంజినీరింగ్‌ చివరి పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details