Bank Robbery Gang Arrest: గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్ లాకర్లు కత్తిరించి నగదు దోచుకెళ్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. రెండు ఘటనల్లోనూ నిందితులని తేల్చారు.
గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ లాకర్లు కత్తిరించి.. చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Bank Robbery Gang Arrest: గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ లాకర్లు కత్తిరిస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా అడలో, కొత్తగూడెం జిల్లాలో బ్యాంకుల్లో చోరీలకు పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠాను తెలంగాణ పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలో డిసెంబర్ 5న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగతనం జరిగింది. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులోకి చొరబడి 7 లక్షల 31 వేల రూపాయలు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గ్యాస్ కట్టర్‌తో బ్యాంక్ లాకర్ కత్తిరించి దొంగతనం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠాను విజయవాడలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి:ఆవు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్... సర్జరీ చేసిన డాక్టర్