ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అపహరించి.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వికారాబాద్ జిల్లా కోత్లాపూర్ గ్రామానికి చెందిన బేగారి అరుణ్‌కుమార్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. జూబ్లీహిల్స్ ఠాణా పరిధి బోరబండ సైట్ 3లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు.
KIDNAP: ప్రేమ పేరుతో మైనర్ కిడ్నాప్.. పలుమార్లు అత్యాచారం!
ప్రేమపేరుతో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి.. కటకటాలపాలయ్యాడు.
ప్రేమ పేరుతో మైనర్ కిడ్నాప్.. పలుమార్లు అత్యాచారం!
బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీని కనుగొని ఠాణాకు తీసుకొచ్చారు. బాలికను విచారించగా అసలు విషయం తెలిపింది. అరుణ్‌కుమార్ తన వెంట తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Cyber Crime: కిలో బాదం రూ.300, జీడిపప్పు రూ.500..!