రైల్వే ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడితోపాటు బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ చంద్రభాను, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీను, నరసింహ శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌దశరథ్ శ్రీపతి(33) పుణెలో హోటళ్లలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని రిజర్వేషన్ టికెట్లు తీసుకుని రైలు ఎక్కేవాడు.
Railway Crime News: టికెట్ బుక్ చేసుకుని మరీ చోరీలు! - Secundrabad Railway station
రైల్వే స్టేషన్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడితోపాటు బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ప్రయాణికులు నిద్రలో ఉండగా దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈనెల 18న మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలి బ్యాగులోని 80గ్రాముల బంగారు నగలు, రూ.లక్ష నగదు దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం రైల్వేస్టేషన్‌లో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దొంగిలించిన నగలను సిద్దిఅంబర్ బజార్‌లోని సిద్ధనాథ్ బంగారు దుకాణ నిర్వాహకుడు రమేష్ ఏకనాథ్ షిండే(44)కు విక్రయించినట్లుగా అంగీకరించాడు. వారిద్దరి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, రూ.1లక్ష నగదు, 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి:Huzurabad by poll 2021 : ఓటు వేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు