తెలంగాణ

telangana

ETV Bharat / crime

BLACK FUNGUS: 7వేల రూపాయల ఇంజెక్షన్ 50వేలకు అమ్మారు..

కరోనా, బ్లాక్ ఫంగస్​తో నానా అవస్థలు పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్​లో అమ్మే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. బ్లాక్​ ఫంగస్​ చికిత్సలో వాడే ఇంజెక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న రెండు ముఠాలను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించి వాళ్ల ఆట కట్టించారు.

black fungus
బ్లాక్‌లో బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్టు

By

Published : Jun 17, 2021, 5:23 PM IST

బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే యాంపొటెరిసిన్-బీ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన 9 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి 28 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడు వేల రూపాయలు ఉండే ఇంజెక్షన్‌ ఒక్కోటి బ్లాక్‌లో 35 వేల నుంచి 50 వేల వరకు విక్రయిస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.

డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న వాళ్ల ఆటకట్టించిన ఎస్సార్​ నగర్‌, జూబ్లీహిల్స్ పోలీసులను సీపీ అభినందించారు. మొదటి ముఠాలో మెడకల్ రిప్రజెంటిటివ్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్, నలుగురితో కలిసి అక్రమ దందా చేస్తున్నాడు. రెండో ముఠాలో బాలస్వామి ప్రధాన నిందితుడని.. గుంటూరుకి చెందిన మరొకడు పరారీలో ఉన్నాడని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

బ్లాక్‌లో బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్టు

ఇదీ చదవండి: vaccination: వ్యాక్సిన్ కావాలంటే సిరంజీలు మీరే తెచ్చుకోండి..!

ABOUT THE AUTHOR

...view details