ఏపీలోని కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువతిపై అత్యాచారం నిందితులను పట్టుకునేందుకు తాజాగా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపారు. గురువారం నుంచి నిందితుల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతం, మంగళగిరి, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాలతోపాటు బందరులో జల్లెడ పడుతున్నారు. ఈ కేసు విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించారు.
అత్యాచారం నిందితుల గాలింపునకు ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు - ap news
ఏపీలోని కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువతిపై అత్యాచారం నిందితులను పట్టుకునేందుకు తాజాగా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను రంగంలోకి దింపారు. నిందితుల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతం, మంగళగిరి, ఇబ్రహీంపట్నం అటవీ ప్రాంతాలతోపాటు బందరులో జల్లెడ పడుతున్నారు.

ఏపీలో యువతిపై అత్యాచారం, రేప్ కేసు నిందితుల కోసం ఆర్మడ్ రిజర్వు పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు
హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనితలు 3 రోజుల కిందట నిందితుల ఆచూకీ లభ్యమైందని.. మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. తీరా నిందితులు ఇంకా పట్టుబడక కేసు దర్యాప్తు పోలీసులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.