తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎమ్మెల్యేల ఎర కేసు.. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై ముగిసిన వాదనలు

Buying TRS MLAs Issue Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులనువారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు ముగిశాయి. నాంపల్లిలోని అ.ని.శా. ప్రత్యేక కోర్టులో పోలీసులు, నిందితుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.

Buying TRS MLAs Issue
Buying TRS MLAs Issue

By

Published : Nov 9, 2022, 4:06 PM IST

Updated : Nov 9, 2022, 8:50 PM IST

Buying TRS MLAs Issue Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు ముగిశాయి. నాంపల్లిలోని అ.ని.శా. ప్రత్యేక కోర్టులో పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితులు ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని... కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ముగ్గురు నిందితుల వెనక ఎవరెవరున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. రాజకీయ కారణాలతో ముగ్గురిపైనా అక్రమ కేసులు బనాయించారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా డబ్బులు లభించలేదని... సుప్రీంకోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చనే విషయాన్ని ప్రస్తావించినట్లు నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్‌ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details