తెలంగాణ

telangana

ETV Bharat / crime

బిహార్​, స్థానిక కూలీల మధ్య ఘర్షణ.. రాళ్లతో దాడి.. - కూలీల మధ్య ఘర్షణ

Argument among laborers: పొట్టకూటి కోసమని ఎక్కడి నుంచో వచ్చారు. రోజూ ఏదో పనిచేస్తే కానీ దినం గడవని బతుకులు వారివి.. వచ్చిన పనితో సర్దుకోకుండా గొడవలు పడితే ఏం లాభం? అయితే కూలీ విషయమై బిహార్​, స్థానిక కూలీల మధ్య నల్గొండ జిల్లాలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పెద్ద ఘర్షణకు దారి తీసింది.

godava
గొడవ

By

Published : Oct 2, 2022, 12:36 PM IST

Updated : Oct 2, 2022, 12:57 PM IST

Argument among laborers:‍‌ బిహార్​, స్థానిక కూలీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్గొండ భాస్కర్ టాకీస్ కూలీ అడ్డా వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఉపాధి విషయంలో.. స్థానిక కూలీలు, బిహార్‌ కూలీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ రణ రంగాన్ని తలపించింది. స్థానిక కూలీలు, బిహారీలు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కూలీలు నిత్యం వివిధ కూలి పనుల కోసం నిత్యం పట్టణానికి వస్తుంటారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఇక్కడే స్థిరపడ్డ కొంతమంది కూలీలు నిత్యం భాస్కర్ థియేటర్ చౌరస్తా వద్దకు వచ్చి జిల్లా కేంద్రంలోని వివిధ పనులకు వెళుతుంటారు. 600-700 రూపాయలకు వీరు రోజువారీ కూలీ లభిస్తుంది.

అయితే బిహార్​కు చెందిన కూలీలు 300-400 రూపాయలకే పనులకు వెళ్తున్నారు. దీనివల్ల స్థానిక కూలీలకు పనులు దొరకడం లేదు. 300 రూపాయలకు వెళితే కూలీ ఏం గిట్టుబాటు అవుతుందని వాగ్వాదం జరిగింది. తరువాత ఇరు వర్గాలు ఒకరిపైకి ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి కొంతమందిని వన్ టౌన్ పోలీసు స్టేషన్​కి తరలించి విచారిస్తున్నట్లు సిఐ తెలిపారు.

బిహార్, స్థానిక కూలీల మధ్య గొడవ

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details