తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిలోఫర్​లో శిశువు మృతి... కుటుంబ సభ్యుల ఆందోళన - Hyderabad niloufer hospital news

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించిందంటూ బాధిత కుటుంబ సభ్యులు హైదరాబాద్​ నిలోఫర్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని హామీ ఇవ్వగా వారు శాంతించారు.

Anxiety of family members
నిలోఫర్​లో శిశువు మృతి

By

Published : Apr 4, 2021, 9:10 AM IST

హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో ఓ శిశువు మృతి చెందింది. నల్గొండ జిల్లాకు చెందిన మూడు నెలల నవ్యను... జ్వరం రాగా నాలుగు రోజుల కిందట కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న నవ్య అర్ధరాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని... నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని నవ్య కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:సెగలు పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details