హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పరిధిలో ఈనెల 19న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు ఇవాళ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలవగా.. ఈరోజు చికిత్స పొందుతూ డీఅర్డీఓ అపోలోలో అమన్, పంచు.. ఉస్మానియా ఆసుపత్రిలో కార్తీక్ మృతి చెందారు. మరో 9 మంది చందానగరల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మీర్ చౌక్ పరిధిలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతి - hyderabad news
పాతబస్తీ మీర్ చౌక్ పరిధిలో సిలిండర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈనెల 19న జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం 9 మంది చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మీర్ చౌక్ పరిధిలో సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతి
చౌక్ మైదాన్ ఖాన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పశ్చిమ బంగాకి చెందిన 16 మంది బంగారం పని చేస్తున్నారు. వంట చేసేందుకు గ్యాస్ వెలిగించేందుకు ప్రయత్నించగా సిలిండర్ పేలింది. రెగ్యులేటర్ ఊడిపోయి గ్యాస్ లీక్ అయి ఉండటంతో.. లైటర్ వెలిగించగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంలో పేలిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఇదీ చూడండి:ఏటీఎంల వద్ద మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్