తెలంగాణ

telangana

ETV Bharat / crime

మైనర్ బాలిక అత్యాచార కేసులో మరో 10 మంది అరెస్ట్.. - గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Guntur girl rape case: ఏపీలోని గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన బాలికపై అత్యాచారం కేసులో మరో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన కేసులో మొత్తం 74 మందిని అదుపులోకి తీసుకున్నారు.

another-ten-accused-arrest-in-guntur-girl-rape-case
another-ten-accused-arrest-in-guntur-girl-rape-case

By

Published : Apr 19, 2022, 4:11 PM IST

మైనర్ బాలిక అత్యాచార కేసులో మరో 10 మంది అరెస్ట్..

Guntur girl rape case: ఏపీలోని గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన బాలికపై అత్యాచారం కేసులో.. మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో బాధపడుతున్న బాలికకు..ప్రకృతి వైద్యం చేయిస్తానంటూ మాయమాటలు చెప్పి..వ్యభిచార కూపంలోకి దింపిన కేసులో మొత్తం 74 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 53 సెల్ ఫోన్లు, కారు, 3 ఆటోలు, 3 బైకులు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఇందులో మరో ఆరుగురి పాత్ర ఉందని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details