తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఈ దారుణం.. భయానకం.. 'శ్రద్ధా వాకర్ హత్య'​ను మించేలా..! - Vishaka Woman Murder case Update

Vishaka Woman Murder case Update : ఏపీలోని విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'దిల్లీ శ్రద్ధావాకర్‌' హత్య తరహాలో ఉన్న ఈ ఘటనలో నిందితులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి.. వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Vishaka Woman Murder case Update
Vishaka Woman Murder case Update

By

Published : Dec 6, 2022, 1:55 PM IST

Vishaka Woman Murder case Update : ఆంధ్రప్రదేశ్‌ విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి.. ఏమాత్రం వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలోని శ్రద్ధావాకర్‌ హత్య కేసును తలపించేలా ఉన్న ఈ ఘటనలో నిందితులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కి భారీ ప్లాస్టిక్‌ డ్రమ్ములో భద్రపరచినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Vishaka Woman Murder case latest news : అద్దెకు ఉంటున్న వారి సామగ్రి తీసేసి.. ఇల్లు ఖాళీ చేయించేందుకు యజమాని వచ్చినప్పుడు ఈ గుట్టు రట్టయింది. ఇంటి యజమాని రాకుంటే మృతదేహం పూర్తిగా కుళ్లిన తర్వాత ప్లాస్టిక్‌ సంచులను ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టాలని నిందితులు ప్రణాళిక వేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రుషి (40) పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

రుషి స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట. అతను అద్దెకు ఉన్న ఇంట్లో లభించిన మృతదేహం ఎవరిదన్న విషయాన్ని పోలీసులు రహస్యంగానే ఉంచారు. నిందితుడికి సహకరించిన వ్యకులెవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను రాబడుతున్నారు. ప్లాస్టిక్‌ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్లిన స్థితికి చేరిన శరీర భాగాలను శవపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు పంపించారు. ఆ నివేదికను విశ్లేషిస్తున్నారు.

ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనేనా..?రుషికి, హత్యకు గురైన మహిళకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమైనా విభేదాలు వచ్చాయేమోనన్న కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎండాడలో వెల్డింగ్‌ దుకాణం నిర్వహిస్తున్న ఇంటి యజమాని రమేష్‌ వికలాంగుల కాలనీలోని తన ఇంటి (రేకుల షెడ్డు)ని 2019లో రుషి కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా రుషి వెల్డింగ్‌ పనులకు సహాయకుడిగా రమేష్‌ వద్దే పనికి కుదిరాడు. రెండు నెలలు చేశాక మానేశాడు. ఈ నేపథ్యంలో రెండు, మూడు నెలలకోసారి అద్దె చెల్లించేవాడు.

రమేష్‌ అనారోగ్యం పాలై ఏడాదికి పైగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలాకాలంపాటు రుషి అద్దె చెల్లించలేదు. దాదాపు ఏడాది నుంచి ఆ ఇంట్లో ఉండకపోయినా ఖాళీ చేయలేదు. రమేశ్‌ ఫోన్‌ చేసి అద్దె అడిగినపుడు.. నేడు, రేపు అంటూ చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన రమేశ్‌ ఆదివారం ఇల్లు ఖాళీ చేయించి వేరొకరికి అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయంతో తన కుటుంబంతో వచ్చి సామాన్లు బయట వేస్తుండగా ఈ ఘటన వెలుగుచూసింది.

వేలిముద్రల సేకరణ..:హత్య జరిగిన నివాసంలో క్లూస్‌ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు అయిదు బృందాలుగా నగరంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. అతని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. రుషి తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో కొన్ని నెలలుగా ఉండడం లేదు. దీంతో ఆయన ప్రస్తుత నివాసానికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టారు. మృతదేహం లభ్యమైన ఇంటి యజమాని చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వేర్వేరు కోణాల్లో పోలీసుల ఆరా:మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో.. మహిళ ఎవరన్నది గుర్తించడానికి పోలీసులు ఇబ్బందిపడ్డారు. తలభాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. మృతదేహం అంతగా కుళ్లిపోయినా పరిసర ప్రాంతాల వారికి ఏమాత్రం వాసన రాలేదు. ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కినా.. కొద్దిరోజులకు ఎంతో కొంత వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం వాసన రాకుండా నిందితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయా అంశాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు. హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇటీవల వ్యభిచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కోణంలోనూ ఏమైనా సమాచారం దొరుకుతుందేమోనని ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి..:

ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి నో చెప్పిందని చంపేశాడు..

ప్రేమ వివాహంపై కక్ష.. పెళ్లి కుమారుడి అన్నయ్యను కిడ్నాప్ చేసిన యువతి బంధువులు

ABOUT THE AUTHOR

...view details