తెలంగాణ

telangana

ETV Bharat / crime

జూబ్లీహిల్స్​ ఘటనలానే పాతబస్తీలో ఇంకోటి.. రెండు కేసుల్లోనూ అవన్ని సేమ్! - minor girl rape case

Old city rape case: జూబ్లీహిల్స్​ మైనర్​ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన నేపథ్యంలో.. అచ్చం అలాంటి ఇంకో ఘటన పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలోనూ బాధితురాలు 17 ఏళ్ల మైనరే​ కావటంతో పాటు.. మరికొన్ని విషయాలు సారూప్యంగా ఉండటం గమనార్హం. ఈ ఘటన మే30న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే!

another rape incident in old city like jubilee hills rape case
another rape incident in old city like jubilee hills rape case

By

Published : Jun 5, 2022, 10:08 PM IST

Old city rape case: జూబ్లీహిల్స్​ మైనర్​ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రంలో సంచలంగా మారింది. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటపడుతూ.. కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఇందులో ప్రజాప్రతినిధుల కుమారులుండటం.. వాళ్లు కూడా మైనర్లే కావటంతో.. ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. అచ్చం ఇలాంటి ఘటనే ఇంకోటి పాతబస్తీలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్​ ఘటనకు ఈ ఘటనకు సారూప్యతలుండటం గమనార్హం.

బస్సు కోసం ఎదురుచూస్తుంటే..: హైదరాబాద్​లోని కాలపత్తర్ పోలీస్​స్టేషన్ పరిధి ప్రాంతంలో నివాసముండే 17 ఏళ్ల అమ్మాయి.. చార్మినార్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్​గర్ల్​గా పనిచేస్తోంది. రోజూలాగే మే 30వ తేదీన.. తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్​ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో.. లంగర్​హౌస్ మొగల్ కా నాలాకు చెందిన సూఫీయాన్(23) ఈవెంట్​ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో సదురు యువకుడు.. అక్కడికి వచ్చాడు. అమ్మాయిని చూసి.. తనతో మాట కలిపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియదు.. కానీ.. అమ్మాయిని ఆటోలో తన ఇంటికి తీసుకెళ్లాడు. తనకు దుకాణంలోనే ఆలస్యమైందని.. తోటి స్నేహితురాలి ఇంట్లోనే ఉంటానని అమ్మాయి తల్లికి ఫోన్​ చేసి సమాచారం ఇచ్చింది. కట్​ చేస్తే.. 31న ఉదయం అమ్మాయిని సూఫీయన్​.. షా అలీ బండ వద్ద వదిలి వెళ్లిపోయాడు.

నిందితుడు సూఫీయాన్​

ఐదు రోజుల తర్వాత..: అక్కడి నుంచి అమ్మాయి ఇంటికి చేరుకుంది. కాగా.. ఐదురోజుల తర్వాత అనగా ఈరోజు(జూన్​ 5న) అమ్మాయికి కడుపునొప్పి మొదలైంది. ఇబ్బందిపడుతున్న కూతురుని తల్లి ఏమైందని అడిగితే.. కడుపునొప్పి అని చెప్పింది. తల్లికి అనుమానం వచ్చి.. ఏం జరిగిందని గట్టిగా ఆరా తీయటంతో అమ్మాయి అసలు విషయం చెప్పింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తనకు.. పెండ్లి చేసుకుంటానని సూఫీయన్​ మాయమాటలు చెప్పాడని.. అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని.. ఉదయం కాగానే షా అలీ బండ వద్ద వదిలేసి వెళ్లిపోయాడని తల్లికి వివరించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే కాలపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

రెండు ఘటనల్లో అవే..: మరోవైపు జూబ్లీహిల్స్​ అత్యాచార ఉదంతానికి.. ఈ ఘటనకు మధ్య చాలా సారూప్యతలున్నాయి.

1. రెండు ఘటనల్లోని బాధితులు మైనర్లు.

2. ఈ రెండు ఘటనలు రెండు రోజుల వ్యవధిలోనే జరిగాయి.

3. వెలుగులోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చాయి.

4. ఇద్దరు బాధితురాళ్ల విషయంలో తల్లులు ఆరా తీయటం వల్లేవిషయాలు బయటపడ్డాయి.

5. రెండు ఘటనల్లో.. బాధితురాళ్లకు నిందితులకు అంతకుముందు ఎలాంటి పరిచయాలు లేకపోవటం.. కీలక అంశం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details