తెలంగాణ

telangana

ETV Bharat / crime

భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు - హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన కేసు

వనస్థలిపురంలోని మన్సూరాబాద్​లో భర్తను భార్య హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్‌ పరారీలో ఉండగా.. తాజాగా పురానాపూల్‌ ప్రాంతంలో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Another person arrested in connection with the murder of her husband case at vanasthalipuram
భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

By

Published : Mar 11, 2021, 9:35 PM IST

వనస్థలిపురంలోని మన్సూరాబాద్​లో ఓ వ్యక్తిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా నివసించే గగన్‌దీప్‌ను అతని భార్య నౌషాద్‌ బేగం...గగన్‌ స్నేహితుడు సునీల్‌ సహాయంతో హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది.

పోలీసుల దర్యాప్తులో వీరిద్దరే హత్య చేసినట్టు తేలడంతో నౌషాద్‌ బేగంను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్‌ పరారీలో ఉండగా... గాలింపు చేపట్టి పురానాపూల్‌ ప్రాంతంలో సునీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పథకం ప్రకారమే వీరిద్దరూ కలిసి గగన్‌తో మద్యం సేవించి అతను మత్తులోకి జారుకున్నాక.. దారుణంగా అంతమొందించి ఇంట్లో పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో బయట పడింది. తరువాత గగన్‌ భార్య నౌషాద్‌ తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

ఇదీ చూడండి :డ్రైవర్‌ తాగి ఉన్నాడని తెలిసీ వాహనంలో ప్రయాణిస్తే కేసు తప్పదు

ABOUT THE AUTHOR

...view details