దారుణ యాప్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. స్తంభింపజేసిన ఖాతాల్లో నుంచి అక్రమంగా నగదు బదిలీ చేసుకున్న ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటకు చెందిన ఆనంద్ ఎస్బీఐ ఖాతాకు కోటీ 18లక్షల నగదు బదిలీ అయినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నగదు కోల్‌కతా, గురుగావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి బదిలీ అయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
దాదాపు 200 కోట్లు…
సులభ రుణాల పేరుతో మొబైల్ అప్లికేషన్ల ద్వారా రుణాలు ఇచ్చిన పలు సంస్థలు అధిక వడ్డీ కోసం రుణగ్రహీతలను వేధించాయి. రుణ యాప్ నిర్వాహకుల వేదింపులు తట్టుకోలేక ఏడుగురు మృతి చెందారు. రుణ యాప్ నిర్వాకాలపై పలు ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసి ప్రధాన సూత్రధారి ల్యాంబోతో పాటు 28మందిని అరెస్ట్ చేశారు. నిర్వాహకులకు చెందిన ఖాతాలు సీజ్ చేసి అందులో ఉన్న దాదాపు 200కోట్ల రూపాయలను స్తంభింపజేశారు. రుణ యాప్ నిర్వాహకులు మాత్రం సైబర్ క్రైం పోలీసుల పేరిట కోల్‌కతా, గురుగావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులకు లేఖలు రాశారు.