తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసులో మరో నిందితుడు అరెస్టు - ఏటీఎం దోపీడీ కేసు తాజా వార్తలు

Hyderabad crime news
kukatpally atm robbery case

By

Published : May 4, 2021, 6:19 AM IST

Updated : May 4, 2021, 7:14 AM IST

06:17 May 04

ఏటీఎం దోపిడీ కేసులో మరో నిందితుడు అరెస్టు

                సంచలనం సృష్టించిన హైదరాబాద్​ కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని కొద్ది రోజుల కిందటే పట్టుకోగా... రెండో వ్యక్తి పారిపోయాడు. గన్​ పరారైన దోపిడి దొంగ వద్దే ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మొదటి నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్‌లోని అతని గ్రామంలో నిఘా పెట్టారు. నిందితుడు స్వగ్రామం రాగానే...అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన తుపాకి, ద్విచక్రవాహనం ఎక్కడి నుంచి వచ్చాయి. దోపిడీకి ఎవరైనా సహకరించారా..? అనే అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.  

  ఐదు రోజుల క్రితం కూకట్​పల్లిలోని పటేల్​కుంట పరిధిలోని హెచ్​డీఎఫ్​సీ ఏటీఎం వద్ద ఇద్దరు ఆగంతుకులు ద్విచక్రవాహనంపై వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎంలో నగదు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.5లక్షలు ఎత్తుకు పోయారు. ఈ ఘటనలో ఏటీఎం వద్ద సెక్యురీటీగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. 

ఇదీ చూడండి:ఏటీఎం వద్ద కాల్పుల కేసులో ఒకరు అరెస్ట్​.. ఇంకొకరు పరార్​!

Last Updated : May 4, 2021, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details