తెలంగాణలో మానవ అక్రమ రవాణా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరహా కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం. జాతీయ నేర గణాంక సంస్థ(National Crime Statistics Bureau) విడుదల చేసిన నేర వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు 900 నమోదు కాగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 154 కేసులున్నాయి. తెలంగాణలో 104 నమోదయ్యాయి.
NCRB: మానవ అక్రమ రవాణాలో రెండు... సైబర్ నేరాల్లో నాలుగు
రాష్ట్రం అభివృద్ది దశలో దూసుకెళ్తుందా లేదా అని పక్కన పెడితే... నేర విభాగంలో మాత్రం ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకెళ్లిపోతుంది. మావన అక్రమ రవాణ కేసుల్లో రెండో స్థానంలో ఉండగా... సైబర్, ఆర్థిక నేరాల్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ(NRCB) వార్షిక నివేదిక విడుదల చేసింది.
సైబర్ నేరాల తీవ్రత కూడా తెలంగాణలో అధికమవుతోంది. రెండేళ్ల కాలంలోనే సైబర్ నేరాలు నాలుగింతలకు పెరిగాయి. 2018తో పోల్చితే 2020 నాటికి రాష్ట్రంలో సైబర్ నేరాలు నాలుగు రెట్లను దాటిపోయింది. 2018లో కేవలం 1,205గా ఉన్న సైబర్ నేరాలు 2019లో 2,691కి చేరాయి. 2020కి వచ్చేసరికి ఏకంగా 5,024కు ఎగబాకడం గమనార్హం. 2020లో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ నేరాల నమోదులో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 11,097 నేరాలు నమోదు కాగా.. కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణకంటే ముందున్నాయి.
- భర్తల, అతడి తరఫు బంధువుల క్రూరత్వం కేసులలో రాష్ట్రం అయిదో స్థానంలో నిలిచింది. ఈ తరహా నేరాలు అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 19,962 నమోదు కాగా.. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం తర్వాత తెలంగాణ(7,453)లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
- చిన్నారులపై లైంగిక నేరాల్లో(పోక్సో) తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. అలాగే దళితులపై నేరాల్లోనూ ఏడో స్థానమే. ఈతరహా కేసులు 1,959 నమోదయ్యాయి. గిరిజనులపై నేరాల్లో(573) నాలుగో స్థానంలో నిలిచింది.
- ఆర్థిక నేరాల్లో 4వ స్థానం(12,985)లో ఉంది.
- ఈ ఏడాది నమోదైన శిక్షల్లో ఖరారు శాతం 25.6శాతంగా నమోదైంది.
ఇదీ చూడండి:saidabad incident: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే రూ. 10 లక్షలు