Annual crime report Telangana 2021 : చారిత్రక నగరంగా పేరొందిన వరంగల్‌లో నేరాలు పెరిగినట్లు పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి వెల్లడించారు. హత్యలు, కిడ్నాపులు, మహిళలపై నేరాలు గతేడాదితో పోలిస్తే.. ఈసారి 3.85శాతం ఎక్కువైనట్లు 2021 వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆగడాలు పెచ్చుమీరాయని తెలిపారు. 2020లో 10వేల 622 కేసులు నమోదవగా.. ఈసారి 11వేల 47 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
వరంగల్‌లో నేరాలు పెరిగాయి..
Warangal Annual crime report 2021 : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నేరాలు చేసే 7 ముఠాలను పట్టుకుని.. కోటి 9 లక్షల 62 వేల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ తరుణ్‌జోషి తెలిపారు. గతేడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మూడు రెట్లు, సైబర్ నేరాలు 29 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. వీటి కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని.. బాధితులు జాప్యం చేయకుండా తమ దృష్టికి తీసుకువస్తే నిందితులను పట్టుకోగలమని చెప్పారు. వరంగల్‌ను మత్తుపదార్థ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.