తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూతుర్ని పెళ్లి చేసుకోవడం లేదని ఆక్రోశంతో తండ్రీకొడుకులపై హత్యాయత్నం - తెలంగాణ వార్తలు

ఏపీలోని కడప జిల్లా వీరపునాయునిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతుర్నిపెళ్లి చేసుకోవట్లేదనే అక్కసుతో దారుణానికి ఒడిగట్టారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ద్విచక్ర వాహనం మీద వెళుతున్న తండ్రీ కొడుకుల్ని ట్రాక్టర్​తో ఢీ కొట్టించారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందాడు.

murder, kadapa
హత్య, కడప

By

Published : Jun 28, 2021, 8:17 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా వీరపునాయునిపల్లెలో దారుణానికి ఒడిగట్టారు ఓ అమ్మాయి తల్లిదండ్రులు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోలేదనే కోపంతో యువకుడిని, అతని తండ్రిని.. అమ్మాయి కుటుంబ సభ్యులు ట్రాక్టర్​తో ఢీ కొట్టించారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా.. కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.

వీరపునాయునిపల్లె మండలం వెలమకూరు గ్రామానికి చెందిన చిన్న ఓబుల్ రెడ్డి, కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి వెంకటరమణారెడ్డి కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉండేవి. అయినా చిన్న ఓబుల్ రెడ్డి కుమార్తె అపర్ణ.. ఇరగంరెడ్డి వెంకటరమణా రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని ప్రేమించింది. కానీ ఆ ప్రేమను పవన్ కుమార్ రెడ్డి ఒప్పుకోలేదు.

అపర్ణ తల్లిదండ్రులు, వారి బంధువులు పలుమార్లు వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లి అపర్ణకు తమ అబ్బాయితో పెళ్లి చేయాలని అడిగారు. అందుకు తండ్రీకొడుకులు ఒప్పుకోలేదు. తండ్రీకొడుకులపై పగ పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఎలాగైనా వెంకటరమణా రెడ్డిని, పవన్​ కుమార్​ రెడ్డిపై దాడికి దిగారు.

ఈ నెల 26వ తేదీన తండ్రి కొడుకులు ఇద్దరు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వెంకటరమణా రెడ్డి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:SUICIDE: ప్రాణాలు తీసిన క్షణికావేశం... పిల్లలకు ఉరేసి తల్లి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details