నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర సర్పంచ్ సర్పంచ్ భర్త కిష్టయ్యపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గన్నోర గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్, సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేశారని భైంసా ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. గతేడాది నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. అంగన్వాడీ టీచర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని సర్పంచ్ భర్త ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు.
నేను అంగన్వాడీ టీచర్‌గా 24 ఏళ్లుగా పని చేస్తున్నా. గతేడాది కొత్త సర్పంచ్‌గా ఎన్నికైన మహిళ భర్త తనను వేధిస్తున్నాడు. గ్రామ పంచాయతీకి వచ్చి, తమకు నమస్కారం పెట్టాకే విధులకు వెళ్లాలని అంటున్నారు. ఐదు నిమిషాలు అలస్యమైనా ఫోటోలు తీసి అధికారులకు పంపుతున్నారు. సర్పంచ్, ఆమె భర్త కలిసి తనను విధులకు హాజరు కావాలంటే మా కాళ్లు మొక్కాలా.. లేదంటే నిన్ను డ్యూటీ చేయనియ్యం అంటూ వేధించారు. నన్ను లైంగికంగా కూడా వేధించసాగాడు. తన వద్దకు వస్తేనే నిన్ను డ్యూటీ చేయిస్తానని బెదిరించారు. వారి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశా. నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా. - అంగన్వాడీ టీచర్
గత రెండు రోజులుగాకు అంగన్వాడీ సిబ్బంది తన ఇంటికి రావడం జరిగింది. గతంలో జరిగిన గ్రామ సభలో తనను, తన భార్య సర్పంచ్ లావణ్యను ఆమె తిట్టారు. అంతే కాకుండా మా ఇంటిపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. అంతే తప్ప ఆమెను మేం ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు. తమపై అబద్ధం కేసు పెట్టారు. వారిపై కేసు నమోదు చేయడంతోనే తనపై తప్పడు ఆరోపణలతో కౌంటర్ ఫైల్ చేశారు.- సర్పంచ్ భర్త కిష్టయ్య, గన్నోర గ్రామం
ఇదీ చూడండి: