కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందిందని ఆరోపిస్తూ ఏపీలోని గుంటూరు జీజీహెచ్ ఎదుట ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చండూరుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త నిర్మలాదేవి అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఈనెల 11న ఆమెను జీజీహెచ్లో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.
'వ్యాక్సిన్ వికటించే అంగన్‌వాడీ కార్యకర్త మృతి' - కరోనా వ్యాక్సిన్ తాజా వార్తలు
ఏపీలోని గుంటూరు జీజీహెచ్ ఎదుట ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందిందని ఆరోపించారు.
'వ్యాక్సిన్ వికటించే అంగన్‌వాడీ కార్యకర్త మృతి'
ఈనెల 6న నిర్మలాదేవి కరోనా టీకా రెండో డోసు తీసుకుంది. వ్యాక్సిన్ వికటించే నిర్మలా అస్వస్థతకు గురైందని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని.. రూ. 50 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:గుర్తు తెలియని మృతదేహం లభ్యం