తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎస్సారెస్పీలో కొట్టుకొచ్చిన మృతదేహం - ఎస్సారెస్పీ కాలువలో గుర్తు తెలియని మృతదేహం

ఎస్సారెస్పీ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకుని వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా శ్రీరామగిరి గ్రామ శివారులో జరిగింది. గ్రామస్థులు అందించిన సమాచారంతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

An unmarked corpse washed up in the srsp canal in mahabubabad district
ఎస్సారెస్పీలో కొట్టుకొచ్చిన మృతదేహం

By

Published : Mar 20, 2021, 10:29 PM IST

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ సర్పంచి సహాయంతో శవాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో ఆ ప్రయత్నాన్ని మానుకుని వెనుదిరిగారు.

వరదలో కొట్టుకువచ్చిన మృతదేహం కల్వర్టులో చిక్కుకుంది. శవాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలుకాలేదు. చీకటి పడడంతో పనికి ఆటంకం కలిగిందని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం మళ్లీ ప్రయత్నిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:వీరవాసరం పీఎస్​లో నగదు మాయం చేసిన ఇంటి దొంగలు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details