సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మఠంపల్లి మండలం భోజ్యతండాకి చెందిన సౌదాసోత్ డకియా అనే వ్యక్తి మట్టపల్లి బ్రిడ్జి వద్ద గుంటూరు జిల్లా తంగేడు వైపు వెళ్లడానికి వేచి ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి తనూ అటు వైపు వెళుతున్నాని నమ్మించి లిఫ్ట్ ఇస్తానని బండిపై ఎక్కించుకున్నాడు.
లిఫ్టిస్తానని నమ్మించాడు... రూ.10 వేలు దోచుకెళ్లాడు! - Suryapeta District Latest News
ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి బండిపై ఎక్కించుకున్నాడు. ఊరుదాటాకా అడవిలోకి తీసుకెళ్తుండగా గుర్తించిన వ్యక్తి వాహనంపై నుంచి దూకాడు. పారిపోయి వస్తుండగా సదరు వ్యక్తిని కొట్టి 10 వేల రూపాయలు ఎత్తుకెళ్లాడు.

లిఫ్ట్ ఇస్తానని దారి మళ్లించాడు.. కొట్టి 10 వేలు ఎత్తుకెళ్లాడు
మట్టపల్లి బ్రిడ్జి నది అవతలి వైపునకు వెళ్లిన తర్వాత అడవిలోకి తీసుకుని వెళ్తుండగా సదరు వ్యక్తి గుర్తించి బండి పైనుంచి దూకాడు. ఈ క్రమంలో అతడిని కొట్టి 10 వేల రూపాయలు దోచుకెళ్లాడు. బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో హుజుర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి