కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జాలర్లు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న పోలీసులు... స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉంటాయని... నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు చెక్స్ ఉన్న దుస్తులు ధరించారని తెలిపారు.
పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - తెలంగాణ వార్తలు
కామారెడ్డి జిల్లా పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. జాలర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పోచారం జలాశయంలో మృతదేహం లభ్యం, మృతదేహం లభ్యం
స్థానికంగా ఓ సైకిల్ పార్క్ చేసి ఉందని... సైకిల్ పై 'నింగి రాజు బంజరు' అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై రాజయ్య తెలిపారు. మరిన్ని వివరాలకు 9440795466 నంబర్‌కు ఫోన్ చేయల్సిందిగా కోరారు.
ఇదీ చదవండి:ధాన్యం లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి