నిజామాబాద్ నగర శివారులోని మాదనగర్ చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు.
చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా! - Nizamabad District Latest News
నిజామాబాద్ నగర శివారులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యమైంది. శవం వద్ద చిల్లర సంచి ఉండడంతో యాచకుడని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా! An unidentified body was found in the pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10426343-939-10426343-1611925309385.jpg)
చెరువులో గుర్తుతెలియని ఓ మృతదేహం లభ్యం
స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలిని నిజామాబాద్ రూరల్ ఎస్ఎచ్ఓ మధుసూదన్ గౌడ్ పరిశీలించారు. హత్యా? లేదా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కిడ్నాప్ కేసు: క్షేమంగా తల్లి ఒడికి చేరిన చిన్నారి