తెలంగాణ

telangana

ETV Bharat / crime

వ్యక్తి సజీవదహనం.. ప్రమాదమా లేక హత్యా ..? - kamareddy district crime news

నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు వాచ్​మెన్ ఏర్పాటు చేసుకున్న షెడ్డులో ఓ వ్యక్తి సజీవదహనమైన ఘటన కామారెడ్డి జిల్లా గాంధీనగర్​లో చోటుచేసుకుంది. వాచ్​మెన్ బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

An unidentified body was found in Kamareddy district
కామారెడ్డిలో వ్యక్తి సజీవదహనం

By

Published : Mar 13, 2021, 12:02 PM IST

కామారెడ్డిలోని గాంధీనగర్ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు రేకుల షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనమయ్యాడు. పట్టణానికి చెందిన బిల్డర్ గాంధీనగర్ కాలనీలో కొత్త ఇళ్లు నిర్మాణం చేపట్టాడు. అక్కడ ఇంటి ముందు ఏర్పాటు చేసిన రేకులషెడ్డులో వాచ్‌మెన్ ఉంటాడు. శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌ బంధువుల ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూడగా.. రేకుల షెడ్డు కాలిపోవడంతోపాటు అందులో ఓ వ్యక్తి సజీవదహనం అయినట్టు గుర్తించాడు. బిల్డర్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన పోలీసులకు తెలిపాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యుత్‌ షాక్‌తో మృతిచెందారా లేదా ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చనిపోయిన వ్యక్తి సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్నట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details