గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన సికింద్రాబాద్ జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక చెన్నపురం చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలియాడుతూ కనబడగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.
జవహర్నగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని శవం లభ్యం - An unidentified body found in lake
సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Jawahar Nagar PS area
వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోవడానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి:ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఉచిత ఆర్టీపీసీఆర్ పరీక్షలు