సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మద్రిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు భూ వివాదాలే కారణమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే జహీర్(42).. సొంతూరులోని పొలం చూసేందుకు వచ్చాడు. గుర్తు తెలియని దుండగులు జహీర్ వస్తోన్న కారుని అడ్డుకుని.. అతడిపై ఒక్కసారిగా దాడికి దిగారు.
Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య - Land fights
గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన జహీరాబాద్ సీఐ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు దారి తీసినట్లు సమాచారం.
Brutal murder
కత్తులతో గొంతు, కడుపు, ఎద భాగంలో దారుణంగా పొడిచి హతమార్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన జహీరాబాద్ సీఐ రాజశేఖర్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Rape attempt: ప్రసవానికి వచ్చిన మహిళపై అత్యాచారయత్నం