నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్ నగర్‌లో బ్లాక్ ఫంగస్‌తో గజన్ బాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయికి గత నెలలో కరోనా సోకగా.. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైరస్‌ను జయించి ఈ నెల 5న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ అయింది.
మరో మరణం: బ్లాక్ ఫంగస్‌తో వృద్ధురాలి మృతి - in nirmal district crime news
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ వృద్ధురాలు బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందింది. కరోనాను జయించినా.. ఫంగస్‌ను ఎదుర్కోలేక ప్రాణాలు విడిచింది.
![మరో మరణం: బ్లాక్ ఫంగస్‌తో వృద్ధురాలి మృతి బ్లాక్ ఫంగస్‌తో వృద్ధురాలి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11881388-430-11881388-1621862635205.jpg)
బ్లాక్ ఫంగస్‌తో వృద్ధురాలి మృతి
కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో 5 రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ఆసుపత్రిలో చేర్పించలేక ఇంటి వద్దే చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మృతి చెందింది.
ఇదీ చూడండి: మేమున్నామంటూ... కరోనా బాధితులకు ఇంటివద్దకే భోజనం