మురుగు కాలువలో పడి వృద్ధుడు మరణించాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.ల గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి జగిత్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తాళ్లచెరువు నిండి మత్తడి దూకడంతో పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రవీంద్రరోడ్డులో ఉన్న మురుగు కాలువలో పడి పట్టణానికి చెందిన ఘంటల రాజమల్లయ్య మృతిచెందాడు.
మూడు రోజులుగా కనిపించని వృద్ధుడు.. చివరికి మురుగు కాలువలో.. - జగిత్యాల జిల్లా నేరవార్తలు
మూడురోజులుగా కనిపించని ఓ వృద్ధుడు... చివరికి మురుగు కాలువలో శవమై తేలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మానసిక స్థితి సరిగా లేని రాజమల్లయ్య మూడురోజుల క్రితం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చాలా చోట్ల గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టాక. మురుగు కాలువలో ఇరుక్కుపోయిన మృతదేహం బయటకు వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు ఆ మృతదేహం రాజమల్లయ్యదేనని గుర్తించారు. అనంతరం కేసునమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదీచూడండి:Accident News: పత్తి కూలీల ఆటో బోల్తా... ఇద్దరు మృతి