వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో జరిగింది.
Accident: బైక్ను ఢీకొన్న కారు.. వృద్ధుడు మృతి - రోడ్డు ప్రమాదాలు కారణాలు
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు.. బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
మృతుడు రామాజీపేటకు చెందిన అయిలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్.. యాదగిరిగుట్ట పీఎస్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు.
ఇదీ చదవండి:LADY SI: మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమే కారణం..?