భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన మల్లారెడ్డి.. 20ఏళ్ల క్రితం తన పొలంలో కొంతభాగాన్ని విక్రయించాడు. మిగిలిన భూమిని కూడా కొనుగోలు చేసిన వ్యక్తి ఆక్రమించాడని గ్రామపెద్దల వద్ద వాపోయాడు.
భూ సమస్యపై మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్యాయత్నం..!
భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భూ సమస్యపై మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్యాయత్నం..!
అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. స్థానికులు వెంటనే అతన్ని భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మల్లారెడ్డి శరీరంపై 60 శాతానికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అశ్వాపురం తహసీల్దార్ సురేశ్‌కుమార్ భూసమస్యకు సంబంధించిన వివరాలను సేకరించారు.