భార్యను ఓ వృద్ధుడు కత్తితో నరికి కిరాతకంగా హత్యచేసిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. రంగం బంజరుకు చెందిన సుబ్రహ్మణ్యం(75) తన భార్య విజయలక్ష్మిపై కత్తితో దాడి చేసి... హత్య చేశాడు. అనంతరం పురుగుమందు తాగి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యను కత్తితో నరికి... భర్త ఆత్మహత్య - ఖమ్మం నేర వార్తలు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజరులో దారుణం జరిగింది. సుబ్రహ్మణ్యం అనే వృద్ధుడు తన భార్య విజయలక్ష్మిని కత్తితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యను కత్తితో నరికి చంపిన వృద్ధుడు
వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు అమెరికాలో ఉండగా... మరొకరు కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. తెల్లవారి చూసేసరికి ఇంట్లో దంపతులిద్దరు మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకుగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
Last Updated : Mar 3, 2021, 9:57 AM IST